YS Jagan mohan reddy pension schemeతాము అధికారంలోకి వస్తే పింఛన్ 3000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే అధికారంలోకి రాగానే తాము పింఛన్ పెంచుకుంటూ పోతాం అన్నాం అని, అందుకోసం ఏడాదికి 250 రూపాయిల చప్పున పెంచుతామని మాట మార్చారు. ఆ మేరకు పెంచారు. అయితే రెండో ఏడాది కూడా పూర్తి అవుతున్న రెండో మారు పెంపు మాత్రం ఇంకా జరగలేదు.

మూడో వాయిదా పెంచాల్సిన టైం కూడా వచ్చేస్తుండడం తో ఇది రాజకీయంగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జులై 8 వైఎస్ జయంతి సందర్భంగా ఆ 250 రూపాయిలు పెంచాలని ప్రభుత్వం అనుకుంటుంది. అయితే అధికారులు మాత్రం అట్టి నిర్ణయ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది చాలా రిస్క్ అని ముఖ్యమంత్రి ని వారిస్తున్నట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ భారాన్ని మోసే స్థితిలో లేదని వారు స్పష్టంచేశారట.

ఏపీలో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు, 3.6 లక్షల మంది పెన్షనర్లు (ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళు. ప్రతి నెలా వేతనాలు, పెన్షన్ల కోసం కనీసం రూ. 6 వేల కోట్లు అవసరం. ఆ మొత్తం సర్దుబాటు చేయడమే ఇప్పుడు సమస్య అవుతోంది. ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయానికి వస్తే, చాలా శాఖల్లో నెలల తరబడి వేతనాలు పెండింగులో ఉన్నాయి. అప్పులు తెస్తే గానీ అవి ఇవ్వలేని పరిస్థితి.

ఇక సంక్షేమ పెన్షనల కు రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా 1500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పెంపు కారణంగా ఇంకో 150 కోట్ల మేర ప్రతి నెలా సమీకరించాలి. ఈ తరుణంలో ఈ పెంపు అంత మంచి నిర్ణయం కాదని జగన్ కు అధికారులు చెబుతున్నారు. పైగా అప్పుల పై కూడా కేంద్రం నిఘా ఎక్కువైంది. ఆ తరుణంలో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలని వారు జగన్ కు సూచిస్తున్నారు.