YS Jagan reddy odarpu yatra movie వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి – ఓదార్పు యాత్రకు ఉన్న అవినాభావ సంబంధం తెలియనిది కాదు. హైదరాబాద్ అభివృద్ధి అంటే చంద్రబాబు పేరు గుర్తుకు రావడం ఎంత సహజమో, ‘ఓదార్పు యాత్ర’ అన్న పేరు వినగానే జగన్ మదిలో మెలగడం కూడా అంతే సహజం. అలా ‘ఓదార్పు యాత్ర’కు ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారిన ఈ పేరును సినీ వర్గీయులు తన సినిమాలకు పేరుగా కూడా వాడేసుకుంటున్నారు.

గత కొంత కాలంగా వెబ్ మీడియాలో సందడి చేస్తున్న ఈ “ఓదార్పు యాత్ర” టైటిల్ తో కూడిన సినిమా ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి తాజా పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జగన్ ‘ఓదార్పు యాత్ర’కున్న క్రేజ్ రీత్యా… ఆ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ‘ఓదార్పు యాత్ర’ ద్వారా జగన్ కు ఎలాంటి ఫలితం లభించినా… ఈ ‘ఓదార్పు యాత్ర’ మాత్రం తమకు అనుకూల ఫలితం రావాలంటున్నారు నిర్మాతలు.