YS jagan Mohan Reddy - Gali Janardhan reddy  meetఈ రోజు శుక్రవారం కావడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. పాదయాత్ర నేపథ్యంలో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ నేడు సీబీఐ కోర్టులో విచారణకు రానుంది. మరోవైపు ఓబులాపురం గనుల కేసుకు సంబంధించిన కేసు విషయంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా కోర్టుకు వచ్చారు.

జగన్‌కు వారు ఎదురుపడ్డారు. సబితా ఇంద్రారెడ్డిని చూసిన జగన్.. ఆమెను కళ్లతోనే పలకరించగా, గాలి జనార్థన్‌రెడ్డికి మాత్రం దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం.