YS - Jagan Mohan Reddyప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పేరు కూడా భారతి సిమెంట్స్ పెట్టుబడుల కేసులో చేర్చింది ఈడీ. ఆ కేసులో ఆమెను ఐదవ ముద్దాయిగా చేర్చింది ఈడీ. దీనిపై ఇప్పటికే జగన్ ఘాటుగా స్పందించారు. ఈడీపై కాకుండా ఆ వార్తను ప్రచురించిన మీడియాపై ఆయన నిప్పులు చెరిగారు.

రాజకీయాల్లోకి ఇంట్లోని వారిని లాగడం ఏంటని ప్రశ్నించారు. అయితే సోషల్ మీడియా దీనిపై జగన్ మీద జాలి పడలేదు. తన దాకా వస్తే గానీ జగన్ కు తత్వం బోధపడలేదా? అంటూ దెప్పి పొడిచారు. పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఆయనను ఒక ఆట ఆడుకున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి జగన్ మీడియా ముందు ప్రస్తావించడం మరి ఎటువంటిది అని ప్రశ్నించారు.

తనకో న్యాయం పక్కవాడికి ఇంకో న్యాయమా అని ఎద్దేవా చేశారు. మరి కొందరైతే చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని. భారతి ఆ కంపెనీకి ఎండీగా ఉన్నారు కాబట్టి ఆమె చట్టానికి అతీతురాలేమీ కాదని అంటున్నారు. అదే విధంగా భారతిని అనేక సార్లు జగన్ తన రాజకీయాలకు వాడుకున్నారు. ఇప్పుడు ఇరుకున పెట్టే సందర్భం కాబట్టి కుటుంబసభ్యులు అంటూ తప్పు కోవడమేంటని వారు ఆక్షేపిస్తున్నారు.