ys-jagan-mohan-reddy-comments-on-kcrరెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా సమస్య తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సమర్ధవంతంగా పని చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్పుకుంటున్నా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఒక లక్ష కేసులు దాటేశాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపిస్తుందని.. ఈ మహమ్మారిని ఎదురుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలం అవుతుంది ప్రభుత్వం.

ఈ తరుణంలో ఒక రివ్యూ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఇతర రాష్ట్రాల లా పెద్ద ఆసుపత్రులు లేవు అయిన కొరొనాను ఎదుర్కొంటున్నాము. పరీక్షలు ఎక్కువ చేయబట్టే ఎక్కువ కేసులు వస్తున్నాయి. కేసులు ఎక్కువుగా ఉన్న పరీక్షలు కొనసాగుతాయి, ఎవ్వరు భయపడవద్దు. రికార్డులు తీవ్రత తక్కువ చూపే ప్రభుత్వం మాది కాదు, కొరొనా సోకిన అందరికి వైద్యం అందిస్తాం,” అని చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు జగన్ నిజంగా కేసీఆర్ ని ఉద్దేశించి అన్నారో లేదు గానీ చాలా వరకు తెలంగాణలో జరుగుతున్న వాటికి సరిపోయేలానే ఉంది. అయితే ఆ మేరకు జగన్, కేసీఆర్ ల మధ్య సంబంధాలు చెడినట్టుగా ఎక్కడా లేదు. ఇటీవలే కేటీఆర్ బర్త్ డేకు జగన్ ట్విట్టర్ లో విష్ చేశారు కూడా.

బహుశా జగన్ చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ప్రస్తుత పరిస్థితిని బట్టి అది తెలంగాణలోని అధికారంలో ఉన్న వారిని అన్నట్టుగా అనిపించవచ్చు. ఏది ఏమైనా రెండు ప్రభుత్వాలు తమ ప్రజలను ఏదో ఒక రకంగా ఈ గండం నుండి బయట పడేస్తే అదే చాలు.