YS Jagan Mohan Reddy black money‘బ్లాక్ మనీ’ జాబితాల పేర్లను వెల్లడిస్తూ గత రెండు రోజులుగా ‘పనామా’ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్నాంతా ఓ కుదుపు కుదిపిన ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ నాయకులైన చంద్రబాబు, జగన్ పేర్లు కూడా ఉంటాయని ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మొదటగా ఈ ఆరోపణలకు తెరలేపిన వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ. ‘చంద్రబాబు పేరు కూడా త్వరలోనే పనామా పేపర్స్ లో వస్తుందని వ్యాఖ్యలు చేయడంతో,’ వీటికి కౌంటర్ గా టిడిపి నేత బోండా ఉమా, ‘చంద్రబాబు పేరు కాదు గానీ, జగన్ పేరు మాత్రం ఖచ్చితంగా వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

అయితే అసలు ఈ ఇద్దరు నేతల్లో ఎవరికి ‘పనామా’ పేపర్లో ఎక్కే అవకాశం ఉంది? బరిలో అసలు ఇద్దరు ఉన్నారా? లేక ఒక్కరికే ఆ అవకాశం ఉందా? అన్న చర్చలకు నెటిజన్లు తెరలేపారు. దాదాపు 30 ఏళ్ళ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్ని, 7 సంవత్సరాల జగన్ పొలిటికల్ కెరీర్ ను పరిశీలిస్తే… చంద్రబాబు సుదీర్ఘ అనుభవాన్ని మించిపోయి, ఎవరికీ అందనంత ఎత్తులో జగన్ ఉన్నారనే విషయం నిగ్గు తేలుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అవును… ముప్పై ఏళ్ళుగా చంద్రబాబు సాధించలేని దానిని జగన్ కేవలం 7 సంవత్సరాలలో అంది పుచ్చుకుని ‘పనామా’ పేపర్లో ఎక్కేందుకు ముందు వరుసలో నిల్చున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి సాక్ష్యాలుగా జగన్ 16 నెలల జైలు జీవితాన్ని, సీబీఐ మరియు ఈడీలు ఇప్పటికే దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లను మరియు ఇప్పటికే కొన్ని వందల కోట్లను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎటాచ్ మెంట్ చేసుకోవడాన్ని చూపెడుతున్నారు.

ప్రత్యర్ధి వర్గాల చేత ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు మాత్రం పూర్తిగా వెనుకబడ్డారు. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో చంద్రబాబు ఆస్తులపై అనేక కేసులు వేసినప్పటికీ, అవి రుజువైన దాఖలాలు లేకపోవడంతో ఈ రేసు నుండి చంద్రబాబు పూర్తిగా తప్పుకున్నట్లయ్యింది. దీంతో ‘యువనేత’ జగన్ ముందు ‘అనుభవజ్ఞుడు’ చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ ‘పనామా’ పేపర్ కు ఎక్కే పోటీలో జగన్ ఏకగ్రీవంగా గెలిచే అవకాశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి మీరేమంటారో..?