ys jagan ministers hindu godsగత ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ భారీ విజయం ఆ పార్టీ నేతలలో అహంకారం పెంచిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఒక టీవీ ఛానల్ తో మంత్రి కొడాలి నాని తిరుమల డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ హిందూ దేవుళ్ళ పై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తే కాదు అని అనడం కష్టం.

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల గురించి మాట్లాడుతూ…. “ఆంజనేయస్వామి బొమ్మ చెయ్యి విరిగితే అంజనేయుడికి వచ్చే నష్టం ఏమి లేదు… 10 కేజీల వెండి పోతే దుర్గమ్మకి వచ్చే నష్టం ఏమీ లేదు… కోటి రూపాయల రథం తగలబడితే అంతర్వేది స్వామికి వచ్చే నష్టం ఏమీ లేదు,” అన్నారు.

సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాలలో, సామాన్య ప్రజానీకంలో ఈ వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు తెచ్చిపెడుతుంది. హిందువుల మతవిశ్వాసాల మీద అంతటి చులకన భావనా… ఇదే ఘటన వేరే మతాల మీద జరిగితే అలాగే స్పందించే ధైర్యం చేస్తారా అంటూ విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులను, నాయకులను కంట్రోల్ చెయ్యకపోతే ప్రజలను స్కీంలతో మభ్యపెట్టడం కూడా జరగదు. అధికారంలోకి వచ్చాకా అహంభావం పెరిగింది… వారిని కట్టడి చెయ్యకుండా ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారు అనే ఒపీనియన్ ప్రజల్లోకి వెళ్తే… వారే ఆ అహంభావం తగ్గిస్తారు కూడా.