YS Jagan Men Caught Shooting with Drone at Chandrababu Naidu Houseమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు ప్రైవేటు వ్యక్తులు చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ను ప్రయోగించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని పట్టుకున్నారు. పోలీసులు కలుగ జేసుకొని డ్రోన్‌ ప్రయోగించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడకి చేరుకున్న దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసు జీపును చుట్టుముట్టారు. పట్టుబడిన వారు తాము ముఖ్యమంత్రి జగన్ పర్సనల్ డ్రోన్ ఆపరేటర్ల మని జగన్ వద్ద పని చేసే కిరణ్ అనే అతను చెప్పడంతోనే తాము షూట్ చెయ్యడానికి వచ్చాం అని వారు చెప్పిన వీడియోని టీడీపీ విడుదల చేసింది. నిన్న ముఖ్యమంత్రి హాజరైన స్వాతంత్ర దినోత్సవం ఈవెంట్ ని కూడా మేమే షూట్ చేశామని వారు చెప్పారు. అయితే పట్టుబడిన వారిని కాపాడటానికి ఆ తరువాత ప్రభుత్వమే బరిలోకి దిగింది.

డ్రోన్‌ విజువల్స్‌ తామే చిత్రీకరించమన్నట్లు ఏపీ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరద పరిస్థితిపై తాజా అంచనా కోసమే విజువల్స్‌ తీయమన్నట్లు చెబుతున్నారు. అయితే నిబంధలను ప్రకారం జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ విజువల్స్ తీయమని అధికారం ఏపీ జలవనరుల శాఖకు కూడా లేదని టీడీపీ నాయకులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా చంద్రబాబు జిల్లా ఎస్పీ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో ఫోన్లో మాట్లాడారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు ఎగరడంపై అధికారులను నిలదీశారు.