YS Jagan - Narendra-Modiనిన్న ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి ఢిల్లీకి ప్రయాణం అవ్వబోతున్నారు. రేపు సాయంత్రం 6గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ కు అమిత్ షా అప్పాయింట్మెంట్ లభించలేదు.

ఒక్కసారి మాత్రం అమిత్ షా బర్త్ డే రోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం మాత్రం ఇచ్చారు. ఇదే మొట్టమొదటి పూర్తి స్థాయి అప్పాయింట్మెంట్. భేటీలో భాగంగా మూడు రాజధానులు, రాష్ట్ర విభజన సమస్యలు, పోలవరం నిధులు, శాసనమండలి రద్దు తీర్మానంతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.

ఒక్క రోజు గ్యాప్‌లోనే రెండోసారి జగన్ ఢిల్లీలో పర్యటించడంతో ఏపీ రాజకీయాల్లో సర్వ్రతా చర్చనీయాంశమైంది. ఇది ఇలా ఉండగా ఈ విషయాలపై నిన్న జగన్ మోడీ వద్ద ప్రస్తావించగా.. అమిత్ షాను కలిసి వాటిపై చర్చించాలని చెప్పినట్లు తెలియవచ్చింది. నిన్ననే అప్పాయింట్మెంట్ కోరినా కుదరలేదని సమాచారం.

దీనితో రేపు మళ్ళీ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్ వెంట విజయసాయిరెడ్డి, ఏపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. అయితే రేపు జగన్ హైదరాబాద్ లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కారణంగా కోర్టుకి డుమ్మా కొడతారా లేక కోర్టుకు హాజరయ్యి అటునుండి అటు ఢిల్లీ వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.