Chandrababu Naidu - Pawan Kalyan -YS Jaganతెలుగు దేశం పార్టీ, జనసేనల మద్య మళ్లీ పొత్తు చిగురుస్తోందా అన్న అనుమానానికి ఆస్కారం కలుగుతోందని విశ్లేషకులు అంటున్నారు. పైగా గత సంవత్సర కాలంగా చెడిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల బందాన్ని స్వయంగా జగనే కలిపారా అనే అనుమానం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టిడిపి నేతలు ఎవరూ విమర్శలు చేయవద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మీడియా వర్గాల సమాచారం.

తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ బిజెపి, తెరాస, వైఎస్సాఆర్ కాంగ్రెస్ లపై విమర్శలు చేయాలని , రాష్ట్రానికి వ్యతిరేకంగా తెరాస ఉందని దానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ వంత పాడుతుందని ప్రజలలోకి బలంగా తీసుకుని వెళ్ళమని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట. ఒక దశలో సీనియర్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించారట. ఆయనను కూడా విమర్శించాలి కదా అని అన్నారట.

అయితే దానికి సమాధానం చెప్పకుండా తాను చెప్పింది చేయాలని ఆదేశించారట. పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లవద్దని బాబు చెప్పకనే చెప్పారని మీడియా వర్గాల విశ్లేషణ. ఇటీవలే కాలంలో పవన్ కళ్యాణ్ టీడీపీ మీద విమర్శలు కొంత తగ్గించి వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నారు. తెరాస నాయకులు తన వద్దకు వచ్చి వైఎస్సాఆర్ కాంగ్రెస్ తో పొత్తుకు రాయభారం చేస్తున్నారని ఒకసారి, తెరాసతో చేతులు కలపడం దిగజారుడు రాజకీయం కాదా అని ఇంకోసారి పవన్ విమర్శించారు.

దీని బట్టి పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ టీడీపీతో పొత్తుకు సిద్ధం అయితే ఖచ్చితంగా ఇదే వంకగా చూపించి ఆ పని చేస్తారు. ఆ ప్రకారం చూస్తే జగన్ మోహన్ రెడ్డి వారిద్దరినీ తిరిగి కలిపినట్టు అవుతుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం కూడా లేదు ఈ సమయంలో కూడా ఏ పార్టీ ఎటు వైపు ఉందో తెలియకపోవడం విశేషం. జగన్ మాత్రం పొత్తులు వద్దు అనుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వారితో వైరం కూడా పెట్టుకుంటున్నారు. ఒక వేళ త్రిముఖ పోటీలో హంగ్ ఫలితామంటూ వస్తే అసలు పవన్ కళ్యాణ్ కు మొహం కూడా చూపించలేని పరిస్థితి.