CM-Jagan's-Shocking-PM-About-Coronavirus-and-Local-Electionsఅనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎలాగైనా స్థానిక ఎన్నికలు జరిపించి తీరాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఈ విషయంగా సుప్రీం కోర్టు తలుపు తట్టారు. రేపు అది విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇదే విషయంగా ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఒక లంచ్ మోషన్ పిటీషన్ వేసారు.

అయితే సుప్రీం కోర్టులో రేపు విచారణ ఉన్న నేపథ్యంలో 19వ తారీఖుకి వాయిదా వేసింది హై కోర్టు. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాజీ ఎన్నికల రాష్ట్ర కమిషనర్ రమాకాంత్ రెడ్డిని సచివాలయానికి పిలిపించుకున్నారు. మంత్రులు పెద్డరెడ్డి రామచంద్రరెడ్డి, బొత్స సత్యనారాయణ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఎన్నికల వాయిదా పై తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారని సమాచారం. రమాకాంత్ రెడ్డి వైఎస్ కు అత్యంత నమ్మకమైన అధికారి… 2008లో ఆయనకు కావలసిన అర్హతలు లేకపోయినా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన్ని చీఫ్ సెక్రెటరీని చేశారు.

జగన్ అక్రమాస్తుల కేసులలో అప్పట్లో ఆయన్ని ప్రశ్నించారు కూడా. ఆ తరువాత ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల అధికారిగా కూడా పని చేశారు. అప్పటి చనువుతో ఆయనను పిలిపించుకుని తాజా పరిస్థితుల మీద చర్చించారు జగన్. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఆయనతో చర్చించారు.