ys jagan local - elections -ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా భయం వల్ల ఆరు వారాలు వాయిదా వెయ్యగానే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎప్పుడూ మీడియా ముందుకు రాని ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చంద్రబాబు తొత్తు అని, అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.

అదే విధంగా అసలు కరోనా వైరస్ పెద్ద విషయం కాదని దాని ఎఫెక్ట్ ఏపీ ఉండదని, కేవలం ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితే వచ్చే 5000 కోట్లు పోగొట్టడానికే చంద్రబాబు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే ఎన్నికలు జరగకపోతే 5000 కోట్లు పోతాయి అనేది నిజం కాదా అనే సందేహాలు వస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆ మాట ప్రస్తావించినా ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో ఎక్కడా దాని గురించి ప్రస్తావించడమే దానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు తెలంగాణ ఉద్యమం వల్ల జరగలేదు. ఆ తరువాత ఆలస్యంగా 2014లో జరిగాయి.

అయితే ఆ తరువాత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2015లో విడుదల చేయించుకున్నారు. దీనితో సహేతుకమైన కారణాలతో ఎన్నికలు జరపలేకపోతే కేంద్ర ఆ తరువాతైనా నిధులు విడుదల చేస్తుంది అనే విషయం స్పష్టం అయ్యింది. దీనితో రాజకీయ కారణాల వల్లే తొందరగా ఎన్నికలు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటుంది అనేది అర్ధం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.