YS jagan legal support to Lakshmi Parvathi ముఖ్యమంత్రి జగన్ పుణ్యమా అని లక్ష్మీపార్వతికి మొట్టమొదటి సారిగా ఒక కేబినెట్ ర్యాంకు పదవి దక్కింది. ఆమెను తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమించారు జగన్. ఈలోగా లక్ష్మీపార్వతికి మరొక తీపి కబురు అనుకోకుండా అందింది. చంద్రబాబు పైన నమోదైన కేసులో 14 ఏళ్ల క్రితం ఇచ్చిన స్టే తొలిగించారు. ఆయన పైన నమోదైన ఫిర్యాదుపై విచారణకు కోర్టు అంగీకరించింది.

సివిల్..క్రమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదన సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పుతో..చంద్రబాబు స్టే గడువు ముగిందని..ఆ స్టే కు ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో విచారణ చెయ్యబోతున్నట్టు న్యాయమూర్తి స్పష్టం చేసారు. ఈ కేసు అప్పట్లో లక్ష్మీపార్వతి వేశారు. మొత్తం పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.

ఈ కేసులో పిటీషనర్ అయిన లక్ష్మీ పార్వతి వాంగ్మూలం కూడా కోర్టు నమోదు చేయనుంది. ఈ కేసు విషయంలో ఎటువంటి సహాయం కావాలన్న ప్రభుత్వం తరపునా పార్టీ తరపునా ఉంటుందని జగన్ లక్ష్మీపార్వతికి తెలిపారట. అంతే కాకుండా ఇందులో చంద్రబాబుని గనుక దోషిగా నిలబెడితే పార్టీలో లక్ష్మీపార్వతి పరపతి పెరగడం ఖాయం.

జగన్ ఆమెను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అదే జరిగితే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ సమయంలో కూడా చూడని వైభవం ఇప్పుడు చూడబోతున్నట్టే. మరి లక్ష్మీపార్వతికి ఆ అదృష్టం ఉందొ లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.