YS Jagan - kshatriya controversyతమ సామాజిక వర్గం ఐకాన్ అయినటువంటి అశోక్ గజపతి రాజు మీద ప్రభుత్వం దాడి చేస్తుందని, మంత్రులు విజయసాయి రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని… వారిని అదుపు చెయ్యాలని క్షత్రియ సామజిక వర్గం నిన్న ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసింది. రఘురామ కృష్ణ రాజు, అలాగే అశోక్ గజపతి రాజుల వ్యవహారం తో ఒక్కసారిగా ఆ సామజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

సహజంగా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతుంది ఏ ప్రభుత్వమైనా అయితే జగన్ ప్రభుత్వం మాత్రం అదే సామజిక వర్గం కు చెందిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చేత అశోక్ గజపతి రాజు పై విమర్శలు చేయిస్తూ… ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యవహారాలలో కులసంఘాలు జోక్యం చేసుకోరాదని హితబోధ చేయించారు.

క్షత్రియ సంఘం ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు… ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న రఘురామ కృష్ణ రాజు అంశాన్ని ప్రస్తావించలేదు. పైగా సహజంగా కులసంఘాలు వాడే ఘాటు భాష కాకుండా చాలా సౌమ్యంగా రాశారు. అయినా అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రితో వారికి నీతిబోధలు చేయించడం వారికి రుచించే అవకాశం లేదు.

ఎన్నో దానధర్మాలు చేసి.. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో సౌమ్యుడిగా పేరుపొందిన అశోక్ గజపతి రాజు పై మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రైన శ్రీరంగనాథ రాజు చేత విమర్శలు చేస్తే ఆ సామాజికవర్గం వారు ఎలా నమ్ముతారు అనే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం విశేషం. క్షత్రియులను శాంతపర్చడం కాదు… జగన్ రెచ్చగొడుతున్నారా? అనే అనుమానం రాకమానదు.

Kshatriya -community