Fearing-Court,-Jagan-Government-Decides-To--Take-Backstepjaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండితో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుంది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే 90% కు పైగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జగన్ మీద గుర్రుగా ఉన్నారు.

పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసేలేదు. ఈరోజు ఎన్టీఆర్ జయంతి పార్టీలకు అతీతంగా అందరు నివాళులు అర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి నివాళి లేదు.

సీఎం జగన్ అయితే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. దీనితో జగన్ ఇచ్చిన మాట తప్పుతారా అని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ అభిమానులలో ఒక వర్గం చంద్రబాబు పై ఆగ్రహంతో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికలలో ఓటు వేశారు. అయితే ఇప్పుడు ఆ హామీ పై జగన్ పెదవి విప్పడం లేదు.

మరోవైపు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తన మహానాడు జరుపుకుంటింది. అయితే కరోనా కారణంగా ఈ సారి మహానాడు ఆన్ లైన్ లో జూమ్ యాప్ లో జరుపుకుంటుంది. దాదాపుగా 25,000 కార్యకర్తలు దీనిలో పాల్గొన్నట్టు సమాచారం. రెండు రోజుల మహానాడు గురువారంతో పూర్తి అయ్యింది.