YS Jagan Kodi Kathi Caseప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో గత ఏడాది అక్టోబర్‌ 25న కోడి కత్తి దాడికి గురయ్యారు. ఈ కేసు మొదటి నుండీ ఒక ఆకతాయి చేసిన చేష్టగానే కనిపిస్తుంది అయితే దీని నుండి మైలేజ్ పొందడం కోసం వైకాపా దీనిని హత్యాయత్నంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. జగన్ కు ఎక్కడ సింపతీ వస్తుందో అని ప్రభుత్వం వెంటనే స్పందించి కుట్ర కోణం ఏమీ లేదని ముఖ్యమంత్రి, డీజీపీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే ముఖ్యమంత్రి, డీజీపీ ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కేసు విచారణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశించాలంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకు వెళ్ళారు. కుట్ర కోణాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎయిర్ పోర్టులో జరిగింది గంటకు దానిని ఎన్ఐఏకు అప్పగించింది కోర్టు. దీనితో ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే తదనంతరం ప్రభుత్వం కొద్దిగా అతిగా స్పందిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచన వస్తుందని వార్తలు వస్తున్నాయి. పైగా విశాఖ వచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు విశాఖపట్నం పోలీసులు సహకరించడం లేదట. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే తప్ప ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు వివరాలు ఇవ్వలేమని ఎన్‌ఐఏకు విశాఖ అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ రెండు ఘటనలు నిజంగానే ఈ కేసులో ప్రభుత్వానికి ప్రమేయం ఉంది అని ప్రతిపక్షం చేసే ఆరోపణలకు పూర్తిగా సహకరించేలా ఉంది.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వం వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ అనే చెప్పుకోవాలి. నిజంగా ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం కు పాల్పడితే అది ఖచ్చితంగా కోడి కత్తితో చెయ్యించదు అనేది బేసిక్ ఇంగితం. అది కూడా ఎన్నికలకు సంవత్సరం కూడా లేని సమయంలో ప్రయత్నం చెయ్యారు. ఒకరకంగా ఏమీ లేని కేసును ప్రభుత్వం తన అత్యుత్సాహంతో ఏదో జరిగిపోతుంది అనే భావన కలిగిస్తుంది. ఎన్నికలకు ఆరు నెలలు కూడా లేని సమయంలో ఇటువంటివి ఖచ్చితంగా అధికార పార్టీని ఇబ్బంది పెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.