YS Jagan keeping himself away from YSR Biopic Yatraవైఎస్సాఆర్ జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా యాత్ర. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పూర్తిగా వైఎస్సాఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కాకుండా వైఎస్ ను మొదటి సారి అధికారంలోకి తెచ్చిన పాదయాత్ర అనే కీలక ఘట్టాన్ని ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. మ‌మ్ముట్టి టైటిల్ పాత్ర‌లో మ‌హి.వి.రాఘ‌వ్ దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని విజ‌య్ . చిల్లా, శ‌శిదేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిన్న రాత్రి హైద‌రాబాద్ ఎన్ క‌న్వెన్ష‌న్ లో జ‌రిగింది.

వేడుక ఆద్యంతం వైయ‌స్, జ‌గ‌న్ అభిమానులు ర‌చ్చ ర‌చ్చ చేశారు. అయితే ఈ వేదిక‌కు వైయ‌స్ జ‌గ‌న్ రాక‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రం వైఎస్సాఆర్ కాంగ్రెస్సే తెర వెనుక నుండి నిర్మిస్తుందని పుకార్లు ఉన్నాయి. అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్పాన్సర్ షిప్ నుండి వేడుకకు వచ్చిన అభిమానులను సమీకరించడంతో పాటు అన్నీ పార్టీనే చూసుకుందని సమాచారం. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ అభిమానులు క‌నిపించినా య‌త్ర‌ వేడుక‌లో జ‌గ‌న్ మిస్స‌వ్వ‌డంపై అభిమానులు చ‌ర్చించుకున్నారు.

అయితే ఇది ఒక ప్లాన్ ప్రకారమే అని తెలుస్తుంది. జగన్, వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభావం ఈ సినిమా మీద పడకూడదని, అభిమానులు తీసిన సినిమా గానే దీన్ని భావించాలని జగన్ అనుకుంటున్నారంట. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జగన్ అసలు కలగజేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ నాయ‌కుడి సినిమా తీయాల‌నుకున్నారు.. ఆయ‌న చేసినది మాత్ర‌మే చూపించండి.. చేయ‌నిది చూపించ‌వ‌ద్దు! అని జ‌గ‌న్ అన్నారని వారు ఇంటర్వ్యూలలో చెబుతున్నారు.

మీ సినిమాలో నా ప్ర‌మేయం ఎందుకు? అని అన్నార‌ని వారు అంటున్నారు. ఈ విధంగా జగన్ ప్రభావం ఈ సినిమా లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే పరాజయం పాలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై టీడీపీ ప్రభావం ఎక్కువయ్యి ఆ చిత్రం సామాన్య ప్రజానీకానికి దూరం అయ్యిందని జగన్ బ్యాచ్ అనుకుంటున్నారట. అందుకే ఇవన్నీ లెక్కలోకి తీసుకుని జగన్ ఈ సినిమాకు వీలైనంత దూరం మైంటైన్ చేశారట. 8వ తారీఖున విడుదల అయ్యే ఈ సినిమా విజయవంతం అవుతుందో లేదో చూడాలి మరి.