YS-Jagan-in-Dilemma-About-Government's-Social-Media-Strategyఅసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ చేసిన తొలి ప్రసంగంలోనే టీడీపీపై దండయాత్ర చేశారు. గత సభలో ఫిరాయింపులను టార్గెట్ చేసిన జగన్.. నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. నేను గనుక డోర్ తెరిస్తే… టీడీపీ సభ్యులంతా వైసీపీలోనేనని… చంద్రబాబు చేసినట్టు నేనూ నలుగురికి మంత్రి పదవి ఇస్తే టీడీపీలో ఎవరూ మిగలరని.. మాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు చేసిన పని నేను చేయబోనన్నారు. ‘

పార్టీ ఫిరాయింపులనే ఈ అన్యాయమైన సంప్రదాయం కొనసాగవద్దని, చట్టసభలో ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్ష సభ్యులు కొనసాగాలని, పరిస్థితులు పూర్తిగా మారిపోయి కొత్త సంప్రదాయం రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇదే సందర్భంగా ఇంకో కీలక వ్యాఖ్య చేసారు జగన్. టీడీపీ నుండి ఐదుగురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష కూడా దక్కదని నాకు చెప్పారని, అయితే అలా చేస్తే తనకూ వారికీ తేడా ఉండదని, రాజీనామా చేసి వస్తే తప్ప మేము తీసుకోమని జగన్ చెప్పారు.

చివరి వ్యాఖ్య మీద అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. జగన్ కు దగ్గరైన కొందరు ఎమ్మెల్యేలు ఆ సలహా ఇచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో కూడా అదే విధంగా ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా రాకుండా చేశారు. జగన్ కు అదే సలహా ఇచ్చినా ఆయన పట్టించుకోలేదట. 2014 ఎన్నికల తరువాత ఫిరాయింపులు మొదలు పెట్టింది, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చే సంప్రదాయం మొదలు పెట్టింది కేసీఆరే.