Center -Is the Scapegoat on Special Status Issue - YS Jaganగత ఎన్నికలలో టీడీపీ వెనుక కాపులు నిలబడటం, తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన రాకతో ఆ సామాజికవర్గ ఓటర్లపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఆశలు వదిలేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కాపుల రేజర్వేషన్ల సెగ రగులుతున్నా జగన్ దాని పై పెద్దగా స్పందించింది లేదు. దానికి మద్దత్తు పలికితే వారి ఓట్లు రాకపోగా బీసీ ఓట్లు పోతాయని జగన్ భయమట.

దానితో కాపుల రిజర్వేషన్ల అంశం కేవలం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికే వాడుకుంది ఆ పార్టీ. మరోవైపు కాపుల ఐకాన్ వంగవీటి మోహనరంగను విమర్శించారని అప్పట్లో సీనియర్ నేత గౌతమ్ రెడ్డిని పార్టీని నుండి సస్పెండ్ చేసారు. అయితే తరువాతి కాలంలో ఆయనను నెమ్మదిగా పార్టీలోకి తిరిగి తెచ్చారు.

తాజాగా ఆయన సస్పెన్షన్ ను కూడా పార్టీ ఎత్తివేసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీ సంతృప్తి చెంది సస్పెన్షన్ ఎత్తేసిందట. దీనిపై వంగవీటి రాధ ఎలా స్పందిస్తారో చూడాలి. రాధ గనుక మీడియా ముందుకు వస్తే వైకాపాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. చూడాలి ఏం జరగబోతుందో?