Kanumuru Raghu Rama Krishnam Raju - YS Jaganగత వారం రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను ఎటాక్ చెయ్యడం మొదలుపెట్టారు. దీనితో ఇక ఇరువర్గాల మధ్యా చెడినట్టుగా అనిపిస్తుంది.

కొందరు రాజకీయ విశ్లేషకులు… ఈ ఎంపీ జగన్ చేత సస్పెండ్ చేయించుకోవడానికి ఆరాటపడుతున్నారని, అదే జరిగితే సేఫ్ గా బీజేపీలో వెళ్లి చేరవచ్చని ఆయన వ్యూహం అని వారు అంటున్నారు. ఈ విషయంగా ఆయన ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో మాట్లాడి హామీ తీసుకున్నట్టుగా సమాచారం.

దీని బట్టి ఇప్పటివరకు రఘు రామకృష్ణంరాజును తెరవెనుక నుండి ఆడించింది బీజేపీ అధిష్టానమే అని స్పష్టంగా అర్ధం అవుతుంది. సహజంగా ఇటువంటి సందర్భాలలో అధికార పార్టీ చంద్రబాబు తొత్తు అంటూ ఏవేవో ఆరోపణలు చేసి తప్పించుకుంటుంది. అయితే ఈ విషయంలో అటువైపు ఉన్నది బీజేపీ కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

ఇప్పుడే ఇటువంటి పరిస్థితి ఉంటే మునుముందు జగన్ ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని ఆ పార్టీ వారు అంచనా వేస్తున్నారు. గతంలో జగన్ కేసుల విషయంలో ఇబ్బంది పడుతున్న సమయంలో రఘురామ కృష్ణం రాజు జగన్ కు అండగా నిలిచారు. ఆ తరువాత ఆయనతో విభేదించి టీడీపీలో చేరారు. ఆ సమయంలో జగన్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. అయితే 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి నరసాపురం పార్లమెంట్ కు పోటీ చేసి గెలిచారు.