YS Jagan - Kanna Lakshminarayanaబిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల బిల్లుపైన ,సీఆర్డీఏ రద్దు బిల్లుపైన గవర్నర్ కు రాసిన లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ స్పందన చిత్రంగా ఉంది. ఆయన బిజెపి ప్రయోజనాల కన్నా టిడిపి ప్రయోజనాలకే ఎక్కువ ఆసక్తి కనబరచినట్లుగా అనిపిస్తుందని చెప్పడం గమనార్హం.

ఒకవైపు బిజెపి ఎంపీ జివిఎల్ కానీ రో నేత సునీల్ ధియోదర్ కాని రాజధానుల నిర్ణయం రాష్ట్ర పరిధిలోదని చెబుతుంటే, కన్నా మాత్రం ఏకంగా ఆ బిల్లులను రాజ్యాంగ విరుద్దమని రాయడం ఆశ్చర్యంగానే ఉందాని వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని రైతుల త్యాగమని లేఖ రాయడం బీజేపీ లైన్ కు వ్యతిరేకంగా, రాయలసీమ డిక్లరేషన్ లో బీజేపీ చప్పిన విషయాలు కాని, హైకోర్టు కర్నూలు ఏర్పాటు చేయాలన్న అంశంలో కాని పూర్తిగా కేంద్ర పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఈ లేఖ రాశారన్న భావన కలుగుతుందని అంటున్నారు.

అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే… రాజధాని విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని వారు తెలుసుకోలేకపోవడం. కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీ పెద్దలతో సంప్రదించకుండా అటువంటి లేఖ రాశారు అంటే నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. అదే లైన్ లో మరో ఎంపీ సుజనా చౌదరి కూడా మాట్లాడటం గమనార్హం.

గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కూడా ఇలానే రెండు రకాలుగా తమ నేతలతో మాట్లాడించేది. ఇప్పుడు బీజేపీ కూడా అదే చేయిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ లానే అసలు స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు ఎటైనా మారొచ్చు. అంతా తమకు అనుకూలంగానే ఉంది అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ నేతల పొరపాటే అని చెప్పుకోవాలి.