jana-Sena-Pawan-Kalyanజ‌న‌సేనాని ఎట్ట‌కేల‌కు ఈ రోజు జ‌నాల మ‌ధ్య‌లోకి త‌న‌దైన మేధో ప‌ర‌మైన రాజ‌కీయాల గురించి మాట్లాడారు. రాజ‌కీయాలు కుళ్లిపోయాయ‌న్నారు. బీజేపి ఒక మ‌తానికి ప‌రిమితం అయిపోయింది అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాలు నేర‌వేర్చ‌ని వారు 2019 ఎల‌క్ష‌న్స్ లో మ‌ళ్లీ ఓట్లే వేయ‌మ‌ని అడిగే హ‌క్కు లేద‌న్నారు. త‌న సోద‌రుడు చిరంజీవి స్థాపించిన ప్ర‌జా రాజ్యం పార్టీ బ‌లం కూడా త‌న పార్టీకి లేద‌ని .. త‌ను మాత్రం ప్ర‌జ‌ల కోసం ..వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించడం కోసం దెబ్బ‌లు తింటాన‌ని..అవ‌స‌రం అయితే జైలు కెళ్తాన‌ని అని చెప్పారు.

ఉత్తారంధ్రా లో జ‌న‌సేన పార్టీ కార్య క‌ర్త‌ల్ని ఉద్దేశించి మాట్లాడుతూ..ప‌నిలో ప‌నిగా ఒక అర్ధ‌వంత‌మైన వ్యాఖ్య కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేశారు. కేవ‌లం తండ్రి ముఖ్య‌మంత్రి గా చేశాడు కాబ‌ట్టి..ఆ ఒక్క క్వాలిఫికేష‌న్ ను ప‌ట్టుకుని త‌ను కూడా ముఖ్య మంత్రి కావాల‌ని రాజ‌కీయాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని జ‌గ‌న్ ను ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూటిగానే ప్ర‌శ్నించారు. రాజకీయంగా జ‌గ‌న్ కు ఉన్న అనుభ‌వం శూన్యం. కేవ‌లం త‌న తండ్రి సీయం గా చేశారు. ఆ ఒక్క అర్హ‌త‌ను ఆధారం చేసుకుని తండ్రి మ‌ర‌ణం తోనే రాజ‌కీయం మొద‌లెట్టారు. నిజంగా ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు..? క‌నీసం ఏ పార్టీలోను త‌ను కార్య‌క‌ర్త‌గా కూడా చేసింది లేదు. చేసిన అనుభవం లేదు.తండ్రి వై య‌స్ ఆర్ మీద ఉన్న అభిమానాన్ని క్యాష్ చేసుకోవ‌డానికి వై య‌స్ ఆర్ సీపి పార్టీ పెట్టి.. ముఖ్య‌మంత్రి కావ‌డ‌మే జీవిత ల‌క్ష్యంగా ఆనాలోచిత రాజ‌కీయాలు చేస్తున్నారనే విమ‌ర్శ‌లు జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేదు.

కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రంలో నిధులే లేక .. ప‌రిపాపాల‌న‌ చంద్ర‌బాబు వంటి జాతీయ స్థాయి నాయుకుడికే క‌ష్ట సాధ్యంగా ఉంటే..? ల‌క్ష‌ల కోట్ల అవినీతి ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటున్న జ‌గ‌న్ సీయం అయితే ఏం చేస్తాడు..? ఎలా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాడు..? ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అంటూ పాద‌యాత్ర‌లు చేసినంత మాత్ర‌న సీయం అయితే.. ? సీయం కావాల‌నుకున్న ప్ర‌తి ఒక్క‌రు ఇక పాద‌యాత్ర‌లు చేస్తే స‌రిపోతుంది క‌దా.? ప‌్ర‌జ‌లు త‌ల‌చుకుంటేనే నాయ‌కులు అవుతారు త‌ప్ప‌…? ధ‌న బ‌లంతో ముఖ్య‌మంత్రి కాలేరు.? చ‌రిత్ర‌ను తెలుసుకోవాలి. చ‌రిత్ర‌ను చ‌దువుకోవాలి. ఇదంతా జ‌గ‌న్ కు ప‌డుతుందా..? త‌న ల‌క్ష్యం సీయం ప‌ద‌వే.? ఇత‌రిత్రా జ‌గ‌న్ కు ఏం ప‌ట్ట‌వు పాపం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పింది మాత్రం ఏమి అర్ధం అవుతుందో క‌దా!.