YS Jagan - Supreme Courtకాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏకంగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దేశ రాజకీయాలలోనే సంచలనానికి తెరలేపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అమరావతిలో మేలు పొంది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఎన్వీ రమణ పని చేస్తున్నారని జగన్ వాదన.

ఈ నెల ఆరున ఆ లేఖ రాశారు. ఆ తరువాత హోమ్ మినిస్టర్ అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఈ విషయంగా వారి మద్దతు కూడా కోరారు జగన్. ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి కావడం వారికి కూడా ఇష్టం లేదని అందుకే జగన్ కు మద్దతు ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ వారే ప్రచారం చేశారు.

అది అలా ఉండగా… తాజాగా సుప్రీం కోర్టు మీద కూడా జగన్ అసహనంగా ఉన్నారట. దాదాపుగా లేఖ రాసి పది రోజులు అవుతున్నా ఆ విషయంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన అసహనానికి కారణం అని తెలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు ఏకంగా ఈ అస్త్రంతో ఎన్వీ రమణ అభిశంసన ఖాయమని ప్రగల్బాలు పలికారు.

ఈ తరుణంలో జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంలోని పెద్దలను కదిపే ప్రయత్నం చేస్తారని సమాచారం. ప్రధానమంత్రి, రాష్ట్రపతుల అప్పోయింట్మెంట్ కోరినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఈ విషయంగా ఎన్వీ రమణకు మద్దతుగా న్యాయవాదులు.. మాజీ న్యాయమూర్తుల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. కేసుల భయంతోనే జగన్ న్యాయవ్యవస్థ మీద దాడికి దిగుతున్నారని వారి ఆరోపణ.