YS Jagan Andhra Pradesh Three Capitalsమాట్లాడితే విలువలు, విశ్వసనీయత అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తమ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందిన వారు రావాలంటే.. తన పదవికి రాజీనామా చేసి రావాలని చెబుతారు. అయితే అవసరమైనప్పుడు దానిని ఆయనే మర్చిపోతారు. అందుకు మరో ఉదాహరణ తాడిపత్రి మునిసిపాలిటీ.

తాడిపత్రి మున్సిపాలిటీలో 36 వార్డులుండగా.. అందులో రెండు అధికార పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. అందులో ఒక వార్డు నుంచి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడున్నారు. మిగిలిన 34 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అధికార వైసీపీ అభ్యర్థులు 14 వార్డుల్లో విజయం సాధించారు. వారికి రెండు ఏకగ్రీవమైన నేపథ్యంలో.. మొత్తం ఆ పార్టీ కైవసం చేసుకున్న వార్డుల సంఖ్య 16కు చేరింది.

ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కలుపుకుంటే వారి సంఖ్య తాడిపత్రి మున్సిపాలిటీలో 18కు చేరింది. చైర్మన్‌ పదవి దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 19 ఉండాలి. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీకి మెజార్టీ లేదు. టీడీపీ విషయానికొస్తే.. ఆ పార్టీ 18 వార్డుల్లో గెలిచింది. మిగిలిన రెండు వార్డుల్లో టీడీపీ మిత్రపక్షంగా ఎన్నికల బరిలో దిగిన సీపీఐ ఒక దానిని గెలుచుకోగా.. టీడీపీ మద్దతుదారుడైన స్వతంత్ర అభ్యర్థి ఒకచోట విజయం సాధించారు.

దానితో తాడిపత్రి మున్సిపాలిటీలో వారి సంఖ్య 20కు చేరుకుంది. టీడీపీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటినట్లే అయితే అందుకు అధికార పార్టీ అడ్డుపడుతుంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రిలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా ఆయన ఓటును తిరస్కరించే పనిలో ఉన్నారు. అదీ గాక టీడీపీ గెలిచిన అభ్యర్థులను తమ వైపుకు తిప్పుకుని ఎలాగైనా ఈ మునిసిపాలిటీని చేజిక్కించుకోవాలని అధికార పక్షం చూస్తుంది.