YS Jagan humiliated delhi videoఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేసేందుకు గానూ ఢిల్లీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న పలువురి ప్రముఖులను కలిసి వినతి పత్రాలు అందజేసిన జగన్, ఆ క్రమంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ కు కూడా ఓ పత్రం సమర్పించేందుకు వెళ్లారు. ఆ తర్వాత బయటకు వచ్చిన జగన్, ఏపీలో జరుగుతున్న అవినీతిని వివరించానని, శరద్ పవార్ గారు కూడా అన్ని విన్నారని… మీడియా మిత్రులకు వివరించారు. కానీ, అక్కడ జరిగిందేమిటో తెలుసుకుంటే ఒక్కసారి అవాక్కవ్వాల్సిందే.

దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మీడియా ఆర్భాటంతో శరద్ పవార్ కార్యాలయంలోకి వెళ్ళిన జగన్ కు షాక్ ఇస్తూ, కనీసం జగన్ ను కుర్చీలో కూడా కూర్చోనివ్వలేదు. ముందు మీ వెంట వచ్చిన మందిమార్భాలన్ని బయటకు పంపించాలి అన్నట్లుగా వ్రేలు చూపించగా, ఇంతలో ఒంగోలు ఎంపీ సుబ్బారెడ్డి ఒకే ఒక నిముషం సార్… వినతిపత్రం ఇచ్చి వెళ్ళిపోతాం అని బుజ్జగింపుగా మాట్లాడడం వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

అయినప్పటికీ శరద్ పవార్ సుముఖంగా లేకపోవడంతో కాస్త కంగారుపడ్డ జగన్ మోహన్ రెడ్డి ‘సిత్రాలు’ కూడా పరిశీలించవచ్చు. చివరగా… ఎవరైనా ఒకరిద్దరు మాత్రమే లోపలికి రండి అని చెప్పడంతో… తన మందిగామధులను జగన్ బయటకు పంపించే విధంగా సైగలు చేసారు. మీడియా మిత్రుల ఎదుటే జగన్ కు జరిగిన ఈ అవమానంతో అంతా విస్తుపోయారు. అలాగే భేటీలో కూడా శరద్ పవార్ సరిగా స్పందించలేదని… స్థానిక రాజకీయ సమస్యలను నాకు చెప్తే ప్రయోజనం ఏంటి అన్న రీతిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

లోపల జరిగింది ఒకటి… జగన్ బయటకు వచ్చి చెప్పింది మరొకటి… అన్న విషయాన్ని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. దీంతో జగన్ విమర్శలలో, వ్యాఖ్యలలో ఎంత నిజాయితీ ఉందన్న విషయం మరోసారి ప్రస్పూటంగా తెలిసి వచ్చింది. అయితే జగన్ కు జరిగిన ఈ పరాభవం పట్ల తెలుగు ప్రజలు మిక్కిలి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ప్లానింగ్, నడవడిక, అవగాహన, స్థాయి తెలియకుండా ప్రవర్తించి… తెలుగు వారి పరువు తీసారని మండి పడుతున్నారు. తన హోదాను చూపించుకోవడానికి అది లోటస్ పాండ్ కాదన్న విషయాన్ని జగన్ గుర్తించి ప్రవర్తించినట్లయితే, ఈ స్థాయిలో అవమానం జరిగి ఉండేది కాదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.