YS Jagan insulted hindu cultureఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన ఒక ప్రవాసాంధ్రుల సభకు ఆయన హాజరయ్యి ప్రసంగించారు. ఈ సందర్భంగా సభకు జనం బాగా వచ్చారని కొందరు, రాలేదని ఇంకొందరు కామెంట్లు షరా మాములే. అయితే ఇప్పుడు ఆ ఈవెంట్ కు సంబంధించిన ఒక వివాదం చెలరేగింది. దాని వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ విమర్శలకు దారి తీస్తుంది.

విషయానికి వెళ్తే…. హిందూ సంప్రదాయం ప్రకారం ఏ కార్యక్రమమైనా జ్యోతి ప్రజ్వళనతో మొదలు అవుతుంది. ఆ సభ నిర్వాహకులు కూడా అటువంటి ఏర్పాటు చేసి జగన్ ను జ్యోతి ప్రజ్వళన చెయ్యమన్నారు. ఎంతమంది బలవంతం చేసినా జగన్ ససేమిరా అన్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. చివరికి నిర్వాహకులు ఆ కార్యక్రమం లేకుండానే తంతు ముగించేశారు. స్వతాహా క్రైస్తవ మతస్థుడైన జగన్ ఎన్నికల ముందు హిందువుల మనసు దోచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

పూజలు, యజ్ఞాలు కూడా చేశారు. ఎన్నో క్షేత్రాలు తిరిగారు. స్వాముల చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా తన నిజస్వరూపం చూపిస్తున్నారని అని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం జగన్ అమెరికాలో వ్యక్తిగత పనుల మీద బిజీగా ఉన్నారు. ఈ నెల 22న తిరుగు ప్రయాణం అవుతారు. ఇప్పటికే వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకుండా పోయారనే విమర్శలు గట్టిగా వస్తుండడం మనఅందరికీ తెలిసిందే.