YS Jagan insecureతెలంగాణలో థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా పరిస్థితుల కారణం ఎలా ఉన్నా ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల జీవో కారణంగా థియేటర్ల మనుగడే ప్రశ్నర్ధకంగా మారింది.

దీని గురించి మాట్లాడటానికి సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించడం లేదట. పరిశ్రమ నుండి తనకు సరైన రెస్పెక్ట్ లేదని అందుకే వారికి ఒక పాఠం నేర్పించాలని జగన్ అనుకుంటున్నారని అందుకే ఇలా చేస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.

దీని గురించి సీనియర్ నిర్మాత సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. “ఇండస్ట్రీలో అంతా టీడీపీ సానుభూతిపరులు అనడంలో నిజం లేదు. నాకు తెలిసిన చాలా మంది నిర్మాతలు జగన్ అభిమానులు. జగన్ అంటే చాలా ఇష్టం. కానీ ఫోకస్ లోకి రాలేదు. టీడీపీకి మద్దతు ఇచ్చిన వారు అప్పట్లో ఓపెన్ గా కాంపెయిన్ చేశారు కాబట్టి బయటకు కనిపించరు అంతే,” అని చెప్పుకొచ్చారు.

“ఒక పరిశ్రమ గా మేము రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఉండాలనే కోరుకుంటాం,” అన్నారు. సురేష్ బాబు చెప్పే దాన్నిబట్టి ఇండస్ట్రీలో జగన్ భయపడుతున్నట్టు ఏమీ జరగడం లేదు. అయితే టీడీపీ సానుభూతిపరులు కూడా జై జగన్ అని ఆయన కోరుకుంటున్నారేమో!