YS-Jaganఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాకా ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమలు కన్నెత్తి చూడటం లేదు అనే విమర్శలకు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి.

“మైక్రోసాఫ్ట్ వచ్చింది అని, ఎయిర్ బస్సు రాబోతోంది అని అది వచ్చింది ఇది వచ్చింది అని గతంలో లాగా హడావుడి చేయట్లేదు. ఆ రోజుల్లో మీడియా హడావిడి కూడా అలాగే ఉండేది. ఈరోజు ఏదైనా పరిశ్రమ ఏదైనా వస్తోంది అంటే ఎక్కడ వస్తోంది అనేది కళ్ళకు కనిపిస్తోంది,” అంటూ చెప్పుకొచ్చారు ఆయన.

ఈ రెండున్నరేళ్లలో 68 భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. త్వరలో మరో 62 భారీ, మెగా ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని కూడా చెప్పుకొచ్చారు. పర్రిశమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలపై జాతీయ సర్వేలో ఏపీకి ప్రథమస్థానం వచ్చిందని కూడా చెప్పుకున్నారు సీఎం.

అయితే జగన్ చేసిన ఈ కామెంట్ల పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. “అవును జగన్ గారూ… మీ హయాంలో పరిశ్రమలు వస్తాయనే హడావిడీ లేదు…. వచ్చేదీ లేదు,” అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఈ సందర్భమగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ పదమూడవ స్థానానికి పడిపోయింది అనే కేంద్ర ప్రభుత్వం సర్వేని ఊటంకిస్తూ జగన్ జాతీయ సర్వేలో ఏపీకి ప్రథమస్థానం అనేది గాలి మాటలు అంటూ కొట్టిపారేస్తున్నారు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఓపెన్ చేస్తున్న వీధి కుళాయిలు, విద్యుత్తు ట్రాన్సఫార్మర్లే 68 భారీ, మెగా పరిశ్రమలా అంటూ జోకులు వేస్తున్నారు.