YS Jagan - Pawan Kalyanపవన్ కళ్యాణ్ అంటే విపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి పీకలదాకా కోపం ఆయన లేకపోతే 2014లో తానే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని ఆయన భావన. దీనితో ఆయన మీద విమర్శల హోరు పెంచారు జగన్ ఈ మధ్యనే. అయితే ఉన్నటుండి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుకు చెడటంతో ఆయన మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చినట్టుంది జగన్ కు.

శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను దూషించింది అనే వివాదంను చంద్రబాబు వైపుకు తిప్పారు జనసేనాని. ఇదే సమయం అనుకున్నారో ఏమో జగన్ పవన్ కళ్యాణ్ కు పరోక్షంగా మద్దత్తు ఇచ్చారు. పాదయాత్ర డైరీ అనే పేరుతో జగన్ రాస్తున్నట్టుగా సాక్షిలో ప్రచురితం అవుతున్న కాలమ్ లో దీనిపై జగన్ స్పందించారు.

“ఢిల్లీకి రాజు అయినా అమ్మకు కొడుకే.. అన్నారు మన పెద్దలు. సృష్టిలో జీవులన్నిటికీ అమ్మే తొలి గురువు.. దైవం. అందుకే మాతృదేవోభవ అంటారు. అమ్మ స్థానం అంతటి ఉన్నతమైనది.. పవిత్రమైనది. కొద్ది రోజులుగా అమ్మ స్థానాన్ని దిగజార్చేలా.. అవమానపరిచేలా రాజకీయాలు సాగడం అత్యంత దారుణం.. మహాపాపం. అలాంటి దిగజారుడు రాజకీయాలు ఏమాత్రం సమర్థనీయం కాదు. గత 141 రోజులుగా చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ఎందరో అమ్మలు నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు. వారి ఆప్యాయత, అనురాగాలు అనిర్వచనీయం. అందుకే మాది ఎప్పుడూ ఒకటే సిద్ధాంతం.. ‘అమ్మ ఎవరికైనా అమ్మే.. అమ్మకు నా వందనం” ఇది జగన్ స్పందన.