YS Jagan ignoring Telangana Electionsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెరాస వైకాపా ఒక రహస్య ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం. వైకాపా వ్యూహాత్మకంగా కొన్ని చోట్ల అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ కు పడే రెడ్డి ఓట్లను చీలిస్తే 2019లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తమ వంతు సాయం చేస్తామని తెరాస హామీ ఇచ్చిందట. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రేపుపార్టీ కేంద్ర కార్యాలయం లోటస్‌పాండ్‌లో సమావేశం జరుగుతుంది.

పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ఎస్‌ఈసీ సభ్యులు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు హాజరుకావాలని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై చర్చించనున్నారు.

వ్యూహాత్మకంగా జగన్ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పడకుండా జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తో కలిసి పనిచేస్తున్న అభిప్రాయం కూడా ప్రజలకు రాకూడదని జగన్ అభిప్రాయమట.