YS- Jagan - IAS officer -Ahmad Babuఆర్టీజీఎస్‌ సీఈవో బాబు అహ్మద్ ను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బాబును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సహజంగా సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చెయ్యడం అంటే సదరు అధికారిని ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టే. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులలో బాబు అహ్మద్ నిజాయతిపరుడిగా, సమర్ధవంతుడిగా పేరు. అయితే ఆయనను పక్కన పెట్టడానికి బలమైన కారణం ఉంది.

నాడు విప‌క్ష నేత‌గా జ‌గ‌న్. 2017, ఫిబ్ర‌వ‌రి 27. విజ‌య‌వాడ స‌మీపంలో దివాక‌ర్ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు వేగంతో వెళ్లిన కార‌ణంగా అదుపు త‌ప్పి ప్ర‌మాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో 11 మంది మ‌ర‌ణించ‌గా..మ‌రో 30 మందికి గాయాల య్యాయి. ఆ ప్ర‌మాదం తెలుసుకున్న జ‌గ‌న్ ఘ‌ట‌నా స్థ‌లికి వెళ్లారు. బస్సును ప‌రిశీలించారు. అదే విధంగా బాధితులు చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రికి వెళ్లి పరామ‌ర్శించారు. డాక్టర్ దగ్గర నుండి కొన్ని కాగితాలు లాక్కోవడానికి ప్రయత్నించారు.

బస్సు డ్రైవర్ తాగి నడుపుతున్నాడని ప్రభుత్వం దానిని కప్పిపుచ్చుతుందని జగన్ అనుమానం. ఇంతలో అక్కడ ఉన్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టరు అహ్మ‌ద్ బాబు..జ‌గ‌న్ మ‌ద్య స్వ‌ల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రెండే ఏళ్ళలో నేను ముఖ్యమంత్రి అవుతా అని నిన్ను జైలులో పెడతా అని జగన్ బాబుని హెచ్చరించారు. అప్పట్లో ఇది చాలా వివాదాస్పదం అయ్యింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి బాబు అహ్మద్ ను జైలుకు అయితే పంపలేదు గానీ ప్రస్తుతానికి పక్కన పెట్టారు జగన్ అనే చెప్పుకోవాలి.