YS Jagan has no connection with TTD Assetsనిరర్ధక ఆస్తుల పేరిట తమిళనాడు లో తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన 23 ఆస్తులు వేలం వెయ్యడానికి సిద్ధమైంది టీటీడీ. దీనికి సంబంధించిన జీఓ కూడా వచ్చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతుంది. స్వామి వారి ఆస్తులు చౌక ధరలకు అనుయాయులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం ఈ ప్లాన్ వేసిందని పలువురు ఆరోపణ.

అయితే… టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలి నిర్ణయాలే ఫైనల్‌ అని ఆ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ తిరుమల విషయంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అసలు లేని పింక్ డైమండ్ మాయం అయ్యిందని…. చంద్రబాబు ఇంటిని సోదా చేస్తే స్వామి వారి నగలు దొరుకుతాయని విజయసాయి రెడ్డి వంటి వారు ఆరోపించారు. అయితే అప్పుడు టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు అప్పుడు తెలియకపోవడం శోచనీయం.

తిరుమల మీద వివాదం వచ్చిన ప్రతిసారీ అప్పటి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. కాబట్టి ఇది సెంటిమెంట్ గా మంచి పరిణామం కాదు. ఇది కోట్లాది స్వామి వారి భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం. కాబట్టి ఆస్తుల అమ్మకం విషయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గితేనే మంచిది.