YS Jagan Grama Volunteer Affidavit Controversyకొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఒక గ్రామా వాలంటీర్ అభ్యర్థి నుండి తీసుకున్న అఫిడవిట్ హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం తాను చదువుకోవడం లేదని, భవిష్యత్తులో కూడా చదువుకునే ఉద్దేశం లేదని అభ్యర్థి అఫిడవిట్ సమర్పించాడు. దీనిపై ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పై చదువులు చదువుకోవద్దనే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలతోనే సరిపెట్టుకోవాలా అంటూ రకరకాల విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం చదువుకునే వారైతే ఈ పనికి సరైన సమయం వెచ్చించలేరని, తరువాత చదువు కోసం మానేసేస్తే ఇబ్బందని అట్టివారని అనర్హులను చేసింది.

అయితే విమర్శల తరువాత ఇప్పుడు ప్లేట్ మార్చినట్టుగా కనిపిస్తుందని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. గ్రామ వాలంటీర్ల నుంచి ఎటువంటి అఫిడవిట్లు తీసుకొవద్దని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. కళాశాలలకు వెళ్లే విద్యార్థులను గ్రామ వాలంటీర్లుగా నియమించొద్దని, అలా నియమించిన వారిని తొలగించాలని ఆదేశించారు. విమర్శలు రావడంతో అసలు ప్రస్తుతం చదువుకోవటం లేదని, భవిష్యత్తులో చదువుకోననే విధంగా వారి నుంచి అఫిడవిట్లను తీసుకోవాలని శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది.

కమిషన్‌ సూచనలను వక్రీకరించి అఫిడవిట్లను తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించి, నకిరేకల్లులో జరిగిన సంఘటనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్‌ను కోరామని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అసలు ప్రభుత్వం నుండి ఆదేశాలు రాకుండా అధికారులు ఎందుకు అఫిడవిట్లు అడుగుతారు? ఇప్పుడు విమర్శలు వచ్చాక నెపం అధికారాలు మీద వేస్తున్నారా?