YS Jagan Govt 50 croe rupess loan amaravatiలక్ష కోట్ల పెట్టి రాజధాని నిర్మించడం అనేది అసాధ్యమైన విషయమని అసెంబ్లీ వేదికగా వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ మోహన్ రెడ్డి, మళ్ళీ 3 రాజధానుల బిల్లును తీసుకువస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే రాజధాని పేరిట 50 వేల కోట్లు అప్పు కోసం ప్రపంచ బ్యాంకును కోరడం హాట్ టాపిక్ అయ్యింది. అసలు రాజధాని నిర్మాణానికి అంత ఖర్చు చేసే ఉద్దేశం లేదని కుండబద్ధలు కొట్టిన సీఎం గారికి ఈ వేల కోట్లు అప్పు దేనికి?

జగన్ చెప్తోన్న దానికి, చేస్తోన్న దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోతోందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. లాజిక్ లేకుండా జగన్ వెల్లడిస్తున్న విషయాలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పంచాయితీ రాజ్ శాఖ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఈఎస్ఐ హాస్పిటల్ గానూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కూడా ముఖ్యమంత్రి జగన్ ‘సైడ్ ట్రాక్’ ఎక్కించారని మీడియా వర్గాలు కధనాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రజల వైద్యానికి మంజూరు చేసిన డబ్బులను కూడా జగన్ వేరే ఉద్దేశాలకు వినియోగించడం అనేది ఒక హేయమైన చర్యగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇలా ప్రతి విభాగంలోనూ నిధులను పక్కదారి పట్టిస్తూ సాగుతున్న జగన్ పాలనను చూసి ప్రపంచ బ్యాంకు మరి అంత మొత్తం నిధులను మంజూరు చేస్తుందా? అంటే… ఒకవేళ ప్రపంచ బ్యాంకు నిధులను ఇవ్వదలచినా, దానికి 18 నుండి 24 నెలల సమయం పడుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

అనేక పర్యాయాలు వరల్డ్ బ్యాంకు బృందం వచ్చి నివేదికలు తయారు చేయడం, అలాగే ఏపీ సర్కార్ నుండి సమాచారాన్ని సేకరించడం… ఈ తతంగం అంతా పూర్తి కావాలంటే దాదాపుగా రెండేళ్ల సమయం పడుతుందని, అప్పటికి జగన్ ప్రభుత్వం చివరి దశకు వచ్చేస్తుందనేది ఆర్ధిక మరియు రాజకీయ నిపుణుల వ్యాఖ్యలు.

గత ప్రభుత్వం రాజధాని, పోలవరం తదితర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఐదేళ్లల్లో చేసిన అప్పులను, అభివృద్ధికి తావు లేకుండా రెండేళ్ళల్లోనే దాటేసిన జగన్ సర్కార్ పాలనకు ప్రపంచ బ్యాంకు పచ్చ జెండా ఊపే అవకాశాలు లేవన్నది అంతిమంగా విశ్లేషకులు చేస్తోన్న వ్యాఖ్య. అదే జరిగితే ఏపీ ప్రజల పైన వరల్డ్ బ్యాంకు పాలు పోసినట్లే!