YS Jagan Government vacates chandrababu naidu praja vedhikaఅమరావతిలోని ప్రజావేదిక అధికార ప్రతిపక్షాల మధ్య వివాదాలకు నెలవుగా మారింది. చంద్రబాబు వస్తువులను చెప్పాపెట్టకుండా బయటపడేశారని టీడీపీ నాయకులు అంటుంటే ప్రభుత్వ వాదన మరీ వింతగా ఉంది. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా ప్రభుత్వ నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి వినియోగించుకున్న చంద్రబాబు.. దాన్ని తనకే ఇవ్వాలనడం చర్చనీయాంశంగా మారిందని సాక్షి ఈరోజు ఒక ప్రోగ్రాం ప్రసారం చేసింది.

అంతే కాకుండా కృష్ణానదిపై అక్రమంగా నిర్మించిన భవనాన్ని తన అధికారిక నివాసంగా మార్చుకున్న చంద్రబాబు.. 2017లో దాని పక్కనే ప్రజావేదికను నిబంధనలకు విరుద్ధంగా సీఆర్‌డీఏతో కట్టించారు. ఎటువంటి అనుమతుల్లేకుండా.. ప్రజలను కలుసుకోవాలనే సాకుతో ప్రజావేదికను నిర్మించారు..కానీ ఏనాడూ ప్రజలను అందులోకి రానీయలేదు అని ఆరోపించింది. అయితే ఈ వాదనలో ప్రభుత్వం గానీ సాక్షి గానీ ఒక్క చిన్న పాయింట్ ను మిస్ అవుతున్నాయి.

ప్రజావేదిక అక్రమ కట్టడం అని ఆరోపిస్తున్నారు సరే… గతంలో ప్రతిపక్షంలో ఉండగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ఇదే ఆరోపణలు చేసింది. ఇప్పుడు కూడా దానికే కట్టుబడింది. అయితే అక్రమ కట్టడంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వం ఏమైని మెస్సేజ్ పంపుతుంది? అక్రమ కట్టడాలను ఏం చెయ్యాలి అనేదాని మీద చట్టం ఏం చెబుతుంది? ప్రభుత్వ కార్యకలాపాలు చేసుకోండి అని అయితే ఉండి ఉండదు. ఈ విషయంలో చంద్రబాబు చేసింది తప్పు అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తుంది ఏమిటి?