KCR_YS_Jaganరాష్ట్రవిభజన తరువాత అప్పులు జనాభా నిష్పత్తిలో, ఆస్తులు ఉన్న చోట ఉన్నవారికి అంటూ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా వాడకం ఆధారంగా విద్యుత్హు కేటాయించారు. దీనివల్ల ఆంధ్రాలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఎక్కువగా తెలంగాణ కు ఇవ్వాల్సి వచ్చేది. ఆ విద్యుత్తు కు సంబందించిన బిల్లులు 5000 కోట్ల మేర పెరుకుపోవడం తెలంగాణ కట్టకపోవడం తెలిసిందే.

దీనితో తెలంగాణకు విద్యుత్తు సరఫరా నిలిపివేసి, బాకీల కోసం ట్రిబ్యునల్ వద్ద దివాళా పిటిషన్ వేయించింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వం మారగానే మేము ర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసు వెనక్కు తీసుకుంది. అయితే సమస్య పరిష్కారం దిశగా ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు పడలేదు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద మరో సంచలన ఆరోపణ వస్తుంది.

ఏపీ ట్రాన్స్కో లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 2014-15 సమయంలో ఏ విధంగా తెలంగాణ కు విద్యుత్తు ఇచ్చేదో ఇప్పుడు అదే విధంగా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుండి ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. అంటే తెలంగాణకు కరెంటు ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ కరెంటు కోతలు తెచ్చారు అనేది టీడీపీ నేతల అభియోగం. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.