Vijay Sai Reddy - YS Jaganఏపీ ప్ర‌భుత్వ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఆర్థికంగా దారునంగా దిగ‌జారిపోతోంది. రోజు రోజుకూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ ఏడాదికి క‌నీసం లక్ష కోట్ల‌కు త‌గ్గ‌కుండా అప్పులు చేస్తున్నారు. అయితే నానాటికి పెరుగుతున్న అప్పుల‌తో ఏపీ ప్ర‌జ‌ల‌పై తీవ్ర భారం ప‌డ‌నుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఇక గడిచిన 11 నెలల్లో దాదాపు రూ. 90వేల కోట్ల దాకా అప్పులు తీసుకు వ‌చ్చింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఇక ల‌క్ష కోట్ల‌కు మ‌రో రూ.10వేల కోట్లు త‌క్కువ అయ్యాయ‌ని అనుకుందో ఏమో గానీ.. ఈ రూ.10వేల కోట్ల‌ను కూడా తీసుకు రావాల‌ని డిసైడ్ అయిపోయింది. కార్పొరేషన్లను ఆధారంగా చేసుకుని వ‌చ్చే నెల మార్చిలో మ‌రో రూ. 10వేల తేవాల‌ని చూస్తోంది.

తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రోడ్డు డెవ‌ల‌ప్ కార్పొరేష‌న్ ద్వారా ఐదు వేల కోట్లు, అలాగే బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ఆధారంగా మ‌రో ఐదు వేల కోట్లు మొత్తం ప‌దివేల కోట్లు తేవాల‌ని చూస్తోంది. ఇప్ప‌టికే అప్పుల ప‌ర్మిష‌న్ కోసం ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కానీ ప‌ర్మిష‌న్ మాత్రం రావ‌ట్లేదు.

దీంతో ఆ బాధ్య‌త‌ను వైసీపీ ఎంపీ విజ‌యసాయి రెడ్డి తీసుకున్నారు. కాగా కేంద్రం కూడా జ‌గ‌న్ అప్పులు చేసేందుకు స‌హ‌క‌రిస్తోంది. దీని వెన‌కాల రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు. రీసెంట్ గా మ‌ద్యం పేరున ఉన్న ఆస్తుల‌ను బేవ‌రేజెస్‌కు బ‌ద‌లాయించింది జ‌గ‌న్‌. ప్ర‌భుత్వం పేరున మ‌ద్యం బిజినెస్ చేస్తే అప్పులు రావ‌నే కార‌ణంతో ఇలా చేసింది.

వీటిని తాక‌ట్టు పెట్టి 10వేల కోట్లు తేవాల‌ని చూస్తోంది. అయితే గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ఇలా అప్పులు చేయ‌లేదు. కానీ ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం మాట్లాడితే అప్పుల వెంట ప‌రుగులు తీస్తోంది. దీంతో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యార‌వుతోంది.