Chintamaneni- Prabhakar2013లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉండి విడుదలయ్యారు. అప్పట్లో చంచల్ గుడా నుండి విడుదలైన జగన్ అత్యంత హడావిడిగా ఇంటికి వెళ్లారు. కార్యకర్తల హడావిడి మధ్య కారు లో నిలబడి అందరికీ అభియోగం చేసుకుంటూ వెళ్లారు జగన్. జైలు జీవితం గడిపి బయటకు వచ్చి హడావిడి చెయ్యడంపై ఎవరి అభిప్రాయం వారికి ఉండగా, ఆ హడావిడి మాత్రం ఎవరూ మర్చిపోరు.

అయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ కు మాత్రం అది తప్పుగా కనిపిస్తుందట. 66 రోజులుగా జైలులో ఉన్న మాజీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు నిన్న ఏలూరు కోర్టు బెయిలు మంజూరు చేసింది. వరుసగా పదుల సంఖ్యలో కేసులు పెట్టి చింతమనేనిని బయటకు రానివ్వకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం.

అయితే కోర్టు ఒకేసారి 18 కేసులలో బెయిలు ఇచ్చి, ఆయన విడుదలకు మార్గం సుగమం చేసింది. ఈ తరుణంలో ఆయన అభిమానులు జైలు బయట హడావిడి చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకుంది ప్రభుత్వం. సమావేశాలు ఏర్పాటు చెయ్యడం, విగ్రహాలకు మాలలు వెయ్యడం, మైకులో ప్రసంగించడం, స్లొగన్స్ ఇవ్వడం, ర్యాలీలు చెయ్యడం, వంటి వాటిని జిల్లావ్యాప్తంగా నిషేధించారు.

కేవలం చింతమనేని ఎటువంటి హడావిడి లేకుండా ఇంటికి వెళ్లడం కోసం ఇచ్చిన ఆర్డర్ గా కనిపిస్తుంది. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థాయి నేత… అది కూడా ఇప్పుడు మాజీకు ప్రభుత్వం భయపడుతుంది అంటూ టీడీపీ నేతలు, అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు.