YS Jagan Government only concentrating on local elections than public health

కరోనా ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. తన అనుమతి తీసుకోకుండా ఎలా చేస్తారు అని ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ కి ఫిర్యాదు చేసి ఆ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ మీద కుల ఆరోపణలు చేశారు.

రమేష్ కుమార్ తీరు మార్చుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ముఖ్యమంత్రి స్వయంగా హెచ్చరించారు. ఆ తరువాత అందుకున్న అధికార పార్టీ నేతలు ఆయనను రాయలేని భాషలో దూషించడం మొదలు పెట్టారు. మరోవైపు ఎలాగైనా తన పంథం నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

మూడు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి ముప్పు లేదని, అనుకున్న షెడ్యూల్ బట్టే ఎన్నికలు పూర్తి చెయ్యాలని చీఫ్ సెక్రటరీతో ఎన్నికల కమిషన్ కు లేఖ రాయించారు. స్థానిక ఎన్నికలను వెంటనే జరిపించాలంటూ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది.

ప్రభుత్వం తన చేతికి మట్టి అంటకుండా ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ ఆనుభూతిపరులతో హైకోర్టులో పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం ఇలా రాజకీయాలలో బిజీగా ఉండగా… అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతానికి అతన్ని వేరు చేసి ఉంచారు. అతని సాంపిల్స్ టెస్టుకు పంపారు.