YS Jagan government loans andhra pradesh financial situationఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక స్థితి గురించి రోజుకు ఒక కథనం బయటకు వస్తుంది. బడ్జెట్ లో చూపకుండా కేంద్రం కళ్లుగప్పి అప్పులు తెచ్చి పప్పు బెల్లాలకు పంచి పెడుతున్నారని… దీనితో రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి అద్వాన్నంగా ఉందని అంటున్నారు.

రెండేళ్లలో 56,000 కోట్ల అప్పుని ఆ రూపంలో బడ్జెట్ లో చూపకుండా రాష్ట్రం అప్పుగా తీసుకుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో తెలిపింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని వెంటనే సమాధానం చెప్పాలని ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

సహజంగా ఇటువంటి పరిస్థితులలో కేంద్రం ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి. అటువంటి పరిస్థితులలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. మొత్తం నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్తుంది.అయితే ఇలా చెయ్యడం తేలికైన విషయం కాదు. ఈ వార్త అంతర్జాతీయంగా దేశం పరువు తీస్తుంది.

వివిధ క్రెడిట్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్లు తగ్గిపోతాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంది. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. ఏపీకి ఎక్కువగా అప్పులు ఇచ్చింది ప్రభుత్వ బ్యాంకులే కాబట్టి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు ఈ విషయంలో ముందడుగు వెయ్యడానికి కేంద్ర సంశయించవచ్చు.

అయితే ఏదో ఒకటి చెయ్యకుండా వదిలేస్తే రాష్ట్రం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి కూడా రావచ్చు. దీనితో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేదాని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఈ విషయం జాతీయ స్థాయిలో బయటకు మొదటి సారి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కి అవమానం అనే చెప్పుకోవాలి.