ys jagan government land favour to swamy swaroopanandendra saraswatiఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన స్వామి… స్వామి స్వరూపానంద. జగన్ పై ఉన్న క్రైస్తవ మార్కుని తొలగించి ఆయనను హిందువులకు దగ్గర చెయ్యడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అప్పట్లో తరచూ చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కూడా చేసేవారు.

ఒకానొక సమయంలో ఆయన కూడా రాజకీయ నాయకుడిలా ప్రవర్తించే వారు అని పలువురు విమర్శించేవారు. అలా టీడీపీ పతనంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకు ఋణం తీర్చుకోవడానికా అన్నట్టు… ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం మేలు చేసిందని వార్తలు వస్తున్నాయి.

స్వరూపానందస్వామికి చెందిన విశాఖ శారద పీఠం తిరుమలలో కేటాయింపులకు మించి ఆక్రమించుకున్న భూములను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించింది. అదనంగా ఆక్రమించుకున్న 4,817 చదరపు అడుగులకి రూ 964 చెల్లించాలని అన్నారు. ఇది అడుగుకా, మొత్తానికా అనేది జీవోలో క్లారిటీ లేదు.

రూల్స్ ప్రకారం తిరుమలలో భూమి లీజే గాని, అమ్మకానికి వీల్లేదు. అయితే జీవోలో ఎక్కడా లీజు అన్నట్టు లేదు. దీనితో ఈ విషయం వివాదాస్పదం అవుతుంది. ఈ మధ్య కాలంలో టీటీడీ కేంద్రంగా ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. ఇది మరొకటి. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.