ys-jagan-government-in-trouble-prathipati-pullaraoవివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికలలో టిడిపి ఓటమికి ఒక కారణంగా చెప్పవచ్చు. టిడిపి అధికారం లో ఉండగా జరిగిన హత్య కనుక వైసిపి పార్టీ నింద మొత్తం అధికార పార్టీ అయినా టిడిపి పై వేసింది. సి.బి.ఐ తో విచారణ జరపాలి అని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు జగన్. వైసిపి అధికారంలోకి వచ్చి “వెయ్యి – రోజుల” పాలన సంబరాలు చేసుకున్న తరువాత కూడా బాబాయ్ హత్య నిందితులను గుర్తించలేని పరిస్థితులలో ఉంది ఇప్పటి ప్రభుత్వం. ఆనాటి టీడీపీ ఓటమికి కారణమైనా వివేకా హత్య ఇప్పుడు టిడిపికి ఆయుధంగా మారింది. సి.బీఐ. ఛార్జ్ షీట్ ఆధారంగా చూస్తే అవినాష్ రెడ్డి చుట్టే ఉచ్చు బిగుస్తుంది అని మీడియా లో కధనాలు ప్రచురితమవుతున్నాయి.

చిలకలూరి పేట టిడిపి ఆత్మ గౌరవ సభలో పాల్గొన్న టిడిపి ముఖ్యనాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు జగన్ ప్రభుత్వం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. సి.బి.ఐ విచారణ లో భాగంగా వివేకా హత్య కేసు నిందితులుగా జగన్ కుటుంభసభ్యులే ఉన్నారని, వారిని కాపాడే పనిలో జగన్ రెడ్డి ఉన్నారని పేర్కొన్నారు. జగన్ కు నైతిక విలువలు ఉంటె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 151 కేసులలో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని ఇప్పుడైనా రాజ్యాంగ బద్ధంగా పాలన కొనసాగించాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎం జరిగినా దానికి చంద్రబాబే కారణం అని విమర్శలు చేయడం మాని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు తన తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకు రావాలని విమర్శలు చేశారు. ఈ నెలలోపే సి.బి.ఐ నిజమైనా హంతకులనే అరెస్ట్ చేస్తే జగన్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం అని జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేఖ విధానాలతో ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవనే విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తెరిగి మసులు కోవాలని సూచనా చేశారు.

ఇదే విధంగా తమ మొండి వైఖరితో ముందు కెళితే మాత్రం జగన్ ప్రభుత్వానికి టైం… దగ్గర పడుతుందని పుల్లారావు టైం… చూసుకొని మరీ టిడిపి ఆత్మ గౌరవ సభలో నిర్మోహమాటంగా
పేర్కొన్నారు.