ys-jagan-government-gender-budgetఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటల గారడీ మొదలుపెట్టారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా జెండ‌ర్ బ‌డ్జెట్‌ను మ‌హిళ‌ల కోసం ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అంటే మహిళలకు ఏ సంక్షేమ కార్యక్రమం కింద ఎంత ముడుతుంది అనేది వేరుగా చూపిస్తారంట.

జగన్ ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరిట ఇస్తుంది. ఉదాహరణకు అమ్మ ఒడి పిల్లల చదువుల కోసమైతే అది తల్లుల పేరిట ఇస్తుంది. అలా మహిళల పేరిట ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల నిధులను విడిగా మహిళల కాలమ్ కింద చూపించి వారిని ఆకర్షించే ప్రయత్నం చేసి ఓట్లుగా మార్చుకుంటారు.

“సంక్షేమ కార్యక్రమాల సొమ్ములు మహిళల పేరిట ఇవ్వడం మంచిదే. అయితే అవి ఫైనల్ గా మగవాళ్ల చేతికే వెళ్తాయి మన సమాజంలో అందరికీ తెలిసిందే. ఇలాంటి నామ్ కే వాస్తే కార్యక్రమాలు కాకుండా మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడేలా చెయ్యాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు పెట్టించడం వంటి వాటితో వారిని స్వశక్తికి నిదర్శనంగా నిలబెట్టాలి,” అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అని తెచ్చి పేరుకు మహిళలకు పదువులు ఇచ్చి అసలు అధికారం మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పని చేసే వారి భర్తలకు ఇస్తున్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు దిశా చట్టం తెచ్చాం అని చెప్పుకుంటున్నా… ఇప్పటివరకు ఆ చట్టానికి కేంద్రం ఆమోదం వెయ్యలేదు.