YS Jagan Government changes APJ Abdul Kalam Award to YSR Awardమాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ఉన్న ప్రతిభా అవార్డుల పేరును తనకు తెలియకుండా వైఎస్ పేరుతో మార్చారని, దాని మీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయం లీకులు ఇచ్చింది. వెంటనే సంబంధిత జీవోను రద్దు చేసి, తిరిగి కలాం పేరు పెట్టాలని ఆయన ఆదేశించారట.

గత కొంత కాలంగా రాష్ట్రంలో ఈ పేర్ల మార్పిడి, రంగుల మార్పిడి యథేచ్ఛగా జరుగుతుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటి అన్నిటిని అధికారులే ప్రభుత్వ ప్రమేయం లేకుండా చేస్తున్నారంట నమ్మగలమా. మొన్న ఆ మధ్య ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఆ రంగులు వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను పోలి ఉండటం యాదృచ్చికం అని చెప్పుకొచ్చారు.

అది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం కావొచ్చు. సహజంగా ఒక విషయంలో నిజంగానే ముఖ్యమంత్రికి తెలీకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పకుండా ఒక ఆర్డర్ వస్తే జీవో ఇచ్చిన సదరు అధికారిపై యాక్షన్ తీసుకుంటున్నారో. అయితే అటువంటిది ఏమీ జరగకపోతే అంతా ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరిగిందని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మొన్న ఆ మధ్య పంచాయితీ భవనం కు ఉన్న జాతీయ జండాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెయ్యడం ఇప్పుడు ఏకంగా కలాం పేరు మార్చి వైఎస్ పేరు పెట్టడం రెండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు తేవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు. అందుకే కాబోలు సోషల్ మీడియా మీద కూడా కేసులు పెట్టేలా జీవో తెచ్చారు.