YS Jagan APCRDAజగన్ ప్రభుత్వం చేష్టలు మరీ ముఖ్యంగా అమరావతి విషయంలో చాలా చిత్రంగా ఉంటాయి. కొన్ని రోజుల ముందు సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చెయ్యడానికి శాసనసభలో బిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుని టీడీపీ మండలిలో అడ్డుకుందని ఏకంగా మండలి రద్దుకే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అది ప్రస్తుతం కేంద్ర పరిధిలో ఉంది.

ఒకపక్క సీఆర్డీఏ చట్టం రద్దు ప్రయత్నాలు చేస్తూనే ఇంకో పక్క ఆ చట్టాన్ని ఉపయోగించుకోవడం ప్రభుత్వానికే చెల్లింది. రాజధాని కోసం సమీకరించిన భూములను ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలకు ఇస్తూ…. అదేంటి అని అడిగితే సీఆర్డీఏ చట్టంలో 10% సమీకరించిన భూములు పేదలకు ఇవ్వాలని ఉందని ప్రభుత్వం వాదించింది.

తాజాగా రాజధాని పరిధిలోకి మరో 8 గ్రామాలు వచ్చి చేరాయి. దీంతో సీఆర్టీఏ పరిధి 37 గ్రామాలకు చేరింది. సీఆర్డీఏ పరిధిలోకి తుళ్ళూరు మండలంలోనహరిశ్చంద్రపురం, వడ్డమాను, పెదపరిమి గ్రామాలు, మంగళగిరి మండలం ఆత్మకూరు, నవులూరు, బేతపూడి.. యర్రబాలెం, చినకాకాని గ్రామాలను తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చెయ్యాలని ప్రయత్నిస్తూ… మరో పక్క సీఆర్డీఏ పరిధిలోనికి మరిన్ని గ్రామాలను చేర్చడం ఏంటో? ఇప్పటికే సీఆర్డీఏని లేకుండా చేసి అందులోని గ్రామాలను దగ్గరలోని మునిసిపాలిటీలలో కలుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా సీఆర్డీఏలో కొత్తగా గ్రామాలను కలపడం ఏంటో!