YS Jagan closing to communist partyకొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో భవనకార్మికుల కష్టాలకు సంఘీభావం తెలుపుతో లాంగ్ మార్చ్ చేశారు. గత ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేసిన వామపక్షపార్టీలు అనూహ్యంగా చివరి నిముషంలో ఈ మార్చ్ కు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ బీజేపీని ఆహ్వానించినందున తాము రాము అని ఒక కుంటి సాకు చెప్పారు.

ప్రభుత్వం ప్రభావం వల్లే వామపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఈ అనుమానాలను బలపరుస్తూ ముఖ్యమంత్రి జగన్ వామపక్షాలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవలే మోకాళ్ళకు చికిత్స చేయించుకున్న సిపిఐ నాయకుడు మధుని జగన్ కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

సహజంగా వామపక్ష పార్టీలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంటాయి. వారిని మచ్చిక చేసుకుని అటువంటివి జరగకుండా జగన్ చేసుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ ను ఒంటరిని కూడా చేసినట్టు అవుతుందని ఆయన ఆలోచన కావొచ్చు.

ఇది ఇలా ఉండగా గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వామపక్షాలకు ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంతగా గణనీయ సంఖ్యలో సీట్లు కేటాయించారు. అయితే వారు ఒక్క సీటులో కూడా ధరావత్తు దక్కించుకోలేకపోయారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు వామపక్షాలు హ్యాండ్ ఇస్తాయా అనేది చూడాలి.