YS Jagan free educationవిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వారలు కురిపిస్తూ పోతున్నారు. అడిగినవారికి అడగని వారికి లేదనకుండా హామీలు ఇస్తున్నారు. నిన్న ఒక అడుగు ముందుకు వేసి ఏ చదువైన ఫ్రీ అని ప్రకటించేసారు. చివరికి అది ఇంజనీరింగ్‌, డాక్టర్‌, కలెక్టర్‌ ఆలా ఏదైనా.

“ఆ రోజుల్లో నాన్నగారు ఒక అడుగు ముందుకేసి మన పిల్లల్ని ఇంజనీరింగ్‌, డాక్టర్‌, తదితర చదువులకు ప్రోత్సహించారు. నాన్నగారి తనయుడిగా నేను రెండు అడుగులు ముందుకేస్తున్నా.. ఇంజనీరింగ్‌, డాక్టర్‌, కలెక్టర్‌.. చదువేదైనా అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా చేస్తానని హామీ ఇస్తున్నా,” అని జగన్ ప్రకటించారు.

ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. ఆ లెక్క చాలా సార్లు కోట్లలోకి కూడా వెళ్ళిపోతుంది. అలాంటిది అందరిని ఫ్రీగా డాక్టర్ చదివించేస్తారా? రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేశారు చంద్రబాబు అని ఆరోపిస్తూ ఇలాంటి హామీలకు డబ్బులు ఎక్కడనుండి తెస్తారో? అధికారంలోకి రావడానికి తిప్పలా ఇవన్నీ!