YS Jagan Follows  KCR Againతెలంగాణ ఆర్టీసీ సమ్మె పూర్తి కాగానే సంస్థను కాపాడుకునే పేరుతో బస్సు ఛార్జీలు పెంచేశారు అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే అదనుగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచింది జగన్ ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాలో కరెంటు ఛార్జీలు పెంచేందుకు సిద్ధం అవుతుందని వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఏర్పడితే అంధకారమే అని అనే వారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు అనే వారు. దానితో తెలంగాణాలో పవర్ కట్ అనేది లేకుండా ఉండాలనే పంతంతో 2014-19 మధ్య భారీగా విద్యుత్తు కొనుగోళ్లు చేశారు.

దీనితో డిస్కంలు అప్పులలో కూరుకుపోయాయి. పైగా ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్ల ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి ఉంది. దీనితో కరెంటు ఛార్జీలు పెంచకతప్పదని కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ చార్జీల విషయంలో కేసీఆర్ ని ఫాలో అయిన జగన్, ఈ విషయంలో ఏం చేస్తారు అనేది చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో డిస్కంల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. దీనితో జగన్ కూడా అదే దిశగా వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రతీదీ కేసీఆర్ ని అనుసరిస్తున్నారు అనే అపప్రధ రాకూడదు అనుకుంటే మాత్రం జగన్ ఆ నిర్ణయం తీసుకోరు. అప్పుడు ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకోవచ్చు.