YS Jagan false promisesప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే ధ్యేయంగా పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తూ అడిగిన వారికి, అడగని వారికి హామీలు ఇస్తూ పోతున్నారు. 1000 రూపాయిలు పైగా వచ్చే అన్ని మెడికల్ బిల్లులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేస్తామని చెప్పేశారు జగన్ మోహన్ రెడ్డి. కొన్ని వేల కోట్లు ఖర్చు ఒక్క ఈ పథకానికే ఖర్చు అవ్వబోతుంది.

విభజన తరువాత అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి ఇది దాదాపుగా సాధ్యపడదు అని అందరికి తెలిసిందే. అయితే దీనిని ఎలా అమలు చేస్తారో చెప్పగల్గితేనే జగన్ కు ఓట్లు రాలతాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే “నేను మాట తప్పని రాజశేఖరరెడ్డి కొడుకుని… చేసి చూపిస్తా”.

ఒకప్పుడు ఇదే జగన్ మోహన్ రెడ్డి రుణమాఫీ చేసే స్తోమత ఆంధ్రప్రదేశ్ కు లేదని వాదించారు. అలవికాని హామీలు తాను ఇవ్వజాలనని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అటువంటి హామీలే ఇస్తూ పోతున్నారు. 2019లో అధికారంలోకి రాకపోతే వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం అని ఆయన ఇప్పటికే గ్రహించినట్టున్నారు.