YS Jagan failed to attend YSR Book Launchమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ మరణానంతరం జగన్ తో కలిసి నడవకపోయినా గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబుని ఇరుకున పెడుతూ జగన్ కు బయట నుండే సాయం చేస్తున్నారు. ఇటీవలే ఆయన ‘వైఎస్ తో…’ అనే పేరిట ఒక పుస్తకం రాశారు. సరిగ్గా వైఎస్ మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే పుస్తక ఆవిష్కరణ చేశారు. వైఎస్ సన్నిహితులందరినీ ఆ సభకు పిలిచారు.

వచ్చిన వారంతా తమకు వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకున్నారు. అయితే వైఎస్ కుమారుడు జగన్ మాత్రం ఈ సభకు రాలేదు. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఉండవల్లి జగన్ ను ఈ సభకు ఆహ్వానించారు అయితే ఆయన రావడానికి ఇష్టత చూపించలేదట. జగన్ తన తండ్రిని పొగిడినా వార్చలేరని గతంలో చాలా మంది ఆరోపించారు. ఇది నిజమేనా అనే అనుమానం రాకమానదు. దీని కారణంగానే అక్కడ సభకు హాజరైన వారెవరూ వైఎస్సార్ కాంగ్రెస్ లో లేకపోవడం విశేషం.

వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మ అని చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు కూడా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. చాలా మంది తాము రాజశేఖరరెడ్డి కొడుకుగా జగన్ కు మంచి జరగాలనే కోరుకుంటాం అని చెబుతారుగానీ వైఎస్సార్ కాంగ్రెస్ లో మాత్రం చేరారు. ఈ వ్యవహారశైలి మార్చుకుంటే జగన్ మరింత బలమైన రాజకీయ నాయకుడిగా మారడం ఖాయం. అప్పట్లో వైఎస్ కు బలంగా ఉన్నవారందరినీ కలుపుకుని ముందుకు పోతే ఆయనకే మంచిది.